తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గబ్బాలో బుమ్రా ఆడితే టీమ్‌ఇండియాకు మేలు' - భారత్, ఆస్ట్రేలియా పర్యటన

టీమ్​ఇండియాలో స్టార్​ ఆటగాళ్లకు గాయాల నేపథ్యంలో రిజర్వ్​ బెంచ్​లకు తుదిజట్టులో అవకాశం లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ మదన్​లాల్. అయితే చివరి టెస్టులో బుమ్రా ఆడితే భారత్​కు ఆ మ్యాచ్​ సానుకూలంగా మారుతుందని జోస్యం చెప్పాడు.

Bumrah crucial for Gabba, can adjust length more easily than others
'గబ్బాలో బుమ్రా ఆడితే టీమ్‌ఇండియాకు మేలు'

By

Published : Jan 14, 2021, 10:10 AM IST

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా ఆడితే మంచిదని మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ అభిప్రాయపడ్డాడు. భిన్నంగా ఉండే గబ్బా పిచ్‌పై అతడు టీమ్‌ఇండియాకు కీలకంగా మారతాడని పేర్కొన్నాడు. అతడు 50% ఫిట్‌నెస్‌తో ఉన్నా జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

"బ్రిస్బేన్‌ మైదానం భిన్నమైంది. టీమ్‌ఇండియాకు కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. ఒకవేళ జస్​ప్రీత్​ బుమ్రా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. గాయాలతో సీనియర్లు, కీలక ఆటగాళ్లు లేకపోయినా రిజర్వు బెంచ్‌ పటిష్ఠంగానే ఉంది. వారికి సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరుకుతుంది. ఏదేమైనా సిరీస్​లో ఆఖరి మ్యాచ్‌ కావడం వల్ల రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయం"

-మదన్‌లాల్‌, మాజీ క్రికెటర్

సిడ్నీ టెస్టు ముగిసే సరికి టీమ్‌ఇండియాలో గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితా మరింత పెరిగింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నాడు. బుమ్రా అనారోగ్యంతో ఉన్నాడని తెలిసింది. నాలుగో టెస్టులో అతడు ఆడకపోయినా ఆశ్చర్యం లేదన్న వార్తలు వచ్చాయి. కాగా అతడు బుధవారం జట్టుతో కలిసి సాధన చేయడం గమనార్హం.

"టీమ్‌ఇండియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సగానికి పైగా ఆటగాళ్లు గాయపడ్డారు. కీలక ఆటగాళ్లు లేని లోటు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైతే తుది 11 మందీ ఆడటమే కష్టంగా అనిపిస్తోంది. గాయాల నేపథ్యంలో రిజర్వుబెంచ్‌లో ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. ఒకవేళ అశ్విన్‌ ఫిట్‌గా ఉంటే ఆడతాడు. నిజానికి ఇదెంతో మంచివార్త. గాయాలు, జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారానికి తెలియొచ్చు" అని మదన్‌ లాల్‌ తెలిపారు.

ఇదీ చూడండి:బ్రిస్బేన్​ టెస్టు: తలబడి నిలిచేనా.. ప్రత్యర్థిపై గెలిచేనా?

ABOUT THE AUTHOR

...view details