బ్రూస్ యార్డ్లే.. స్పిన్ బౌలర్‌గా, కోచ్‌గా పేరుపొందారు. వాయవ్య ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ఆయన.. 2016 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ 71 ఏళ్ల వయసులో మార్చి 27న మరణించారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. శ్రీలంక జట్టుకు కోచ్‌గా సేవలందించారు.
ఆస్ట్రేలియా దేశస్థుడైన బ్రూస్ మీడియం పేసర్‌గా అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఏడు వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లు సాధించాడు. యార్డ్లే చేసిన వేగవంతమైన అర్ధ శతకం రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్లో 38 ఏళ్ల పాటు అలానే ఉండిపోయింది. 2017లో డేవిడ్ వార్నర్ ఆ రికార్డును తిరగరాశాడు.