ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. టెస్టు క్రికెట్లో 500 వికెట్లు దక్కించుకుని అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా వెస్డిండీస్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఈ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అయితే తాజాగా దీనిపై స్పందించిన తన సహచర దిగ్గజ ఆటగాడు జేమ్స్ అండర్సన్.. బ్రాడ్‌పై ప్రశంసలతో ముంచెత్తాడు. ఇలానే అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తే భవిష్యత్తులో తన రికార్డును బద్దలకొడతాడని అభిప్రాయపడ్డాడు. మరిన్ని విజయాలు సాధిస్తాడని కొనియాడాడు.
ప్రస్తుతం విండీస్‌తో జరుగుతోన్న సిరీస్‌లో గత రెండు టెస్టుల్లో బ్రాడ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడని అన్నాడు అండర్సన్. బ్రాడ్ ఈ ఘనత సాధిస్తాడని తామెవరం అంచనా వేయలేదని వెల్లడించాడు.