తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ క్రికెటర్ లారాకు కరోనా సోకిందా? - బ్రియాన్ లారా వార్తలు

కరోనా బారిన పడ్డాడనే వార్తలపై స్పందించిన లారా.. తాను పరీక్షలు చేసుకున్నానని, అయితే నెగటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

దిగ్గజ క్రికెటర్ లారాకు కరోనా సోకిందా?
విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా

By

Published : Aug 6, 2020, 12:08 PM IST

దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాకు కరోనా సోకిందని, గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. నిజమేంటో తెలియక అభిమానులు అయోమయానికి గురయ్యారు. వీటన్నింటికి చెక్ పెడుతూ స్వయంగా లారానే అసలు విషయం వెల్లడించాడు. తాను వైద్య పరీక్షలు చేసుకున్నానని, అందులో నెగటివ్ వచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితిని, కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బ్రియాన్ లారా ఇన్​స్టా పోస్ట్

"నాపై వస్తున్న పుకార్లన్నింటినీ చదువుతున్నాను. అందుకే వీటి గురించి మాట్లాడాలని నిర్ణయించాను. దీనితో పాటే ఇంకా చాలా వాటి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అసత్య వార్తలతో కొందరు ఆ భయాన్ని ఇంకాస్త పెంచుతున్నారు" -బ్రియాన్ లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్

2007లో రిటైర్మెంట్​ తీసుకున్న లారా.. 131 టెస్టులు, 299 వన్డేలాడి 22,358 పరుగులు చేశాడు. ఇందులో 53 శతకాలు ఉన్నాయి. 2004లో ఇంగ్లాండ్​పై టెస్టులో చేసిన 400 పరుగుల వ్యక్తిగత రికార్డు ఇప్పటికే అలానే ఉంది. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అత్యధిక పరుగులు(501) ఘనత లారా పేరిటే ఉండటం విశేషం. 1994లో దీనిని సృష్టించాడు.

బ్రియాన్ లారా గణాంకాలు
బ్రియాన్ లారా కరోనా నెగటివ్

ABOUT THE AUTHOR

...view details