తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజేత ఎవరు?... మెక్​ కల్లమ్​ డైరీలో ఏముంది? - ప్రపంచకప్​ 2019

ఈ ప్రపంచకప్​లో ఏయే జట్లు సెమీస్​ చేరుకుంటాయి. ఎన్ని మ్యాచ్​లు గెలుస్తాయో అంచనా వేస్తూ రాసిన వివరాల్ని ఫేస్​బుక్​లో పంచుకున్నాడు కివీస్ మాజీ బ్యాట్స్​మెన్ మెక్​కల్లమ్.

'టీమిండియా సునాయసంగా సెమీస్ చేరుకుంటుంది​'

By

Published : Jun 1, 2019, 9:14 PM IST

Updated : Jun 2, 2019, 9:45 AM IST

ప్రపంచకప్​లో కోహ్లీసేన ఇంగ్లండ్​ చేతిలో మాత్రమే ఓడిపోతుంది... మిగతా అన్ని జట్లపైనా గెలుస్తుంది... వీటితో పాటే పక్కాగా సెమీస్ చేరుకుంటుంది... ఈ మాటలన్నది న్యూజిలాండ్​ స్టార్ బ్యాట్స్​మెన్ మెక్​కల్లమ్​ ఈ టోర్నీలో మిగతా జట్లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాడు. ఈ ఫొటోను ఫేస్​బుక్​లో పంచుకున్నాడు.

మెకకల్లమ్ ఫేస్​బుక్​ పోస్ట్

ఈ మెగా ఈవెంట్​లో ఆతిథ్య ఇంగ్లండ్​, భారత్, ఆస్ట్రేలియా సెమీస్​ చేరుకుంటాయని మెకకల్లమ్ అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్​, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ పోటీ పడతాయని చెప్పాడు.

న్యూజిలాండ్​ స్టార్ బ్యాట్స్​మెన్ మెకకల్లమ్

లీగ్​ దశలో ఇంగ్లండ్​, టీమిండియా ఎనిమిదింటిలో గెలిచి ఒక్క మ్యాచ్​లో మాత్రమే ఓడిపోతాయని చెప్పాడీ స్టార్ బ్యాట్స్​మెన్.​ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్​ కేవలం బంగ్లాదేశ్​, శ్రీలంకపైన మాత్రమే గెలుస్తుందని పేర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్​ నిలుస్తాయని తెలిపాడు.

ఇదీ చదవండి: WC19: ప్రపంచకప్​ బోణి ఆతిథ్య ఇంగ్లండ్​దే

Last Updated : Jun 2, 2019, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details