తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెస్టిండీస్​​తో సిరీస్​కు భారత్ జట్టు ఇదే

వెస్టిండీస్​తో టీ20, వన్డే సిరీస్​లకు భారత జట్టును ప్రకటించింది సెలక్షన్​ కమిటీ. కోల్​కతాలో సమావేశమైన ఎమ్మెస్కే ప్రసాద్ బృందం జట్టు వివరాలను వెల్లడించింది.

వెస్టిండీస్​​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు టీమిండియా ఇదే...

By

Published : Nov 21, 2019, 7:34 PM IST

Updated : Nov 21, 2019, 8:14 PM IST

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు, భారత జట్టును గురువారం ప్రకటించింది సెలక్షన్​ కమిటీ. వన్డే సిరీస్​కు రోహిత్ దూరమవుతాడన్న ఊహాగానాలకు తెరదించుతూ, అతడు జట్టులో చోటు దక్కించుకున్నాడు​. ధావన్​, కేఎల్​ రాహుల్​ తమ స్థానాల్ని నిలుపుకున్నారు. పంత్​కే మరోసారి అవకాశమివ్వగా, సంజు శాంసన్​కు చుక్కెదురైంది. కొన్ని నెలల విశ్రాంతి తర్వాత భువీ మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు.

వన్డేలు, టీ20లకు దాదాపు ఒకే జట్టు ఉండగా... పొట్టి ఫార్మాట్​ మ్యాచ్​లకు కేదార్​ జాదవ్​ బదులు వాషింగ్టన్​ సుందర్​ చోటు దక్కించుకున్నాడు.

సెలక్షన్​ కమిటీతో కోహ్లీ

వన్డే జట్టు

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ, శిఖర్​ ధావన్​, కేఎల్​ రాహుల్​, రిషబ్​ పంత్​, మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​, కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, శివమ్​ దూబే, యజువేంద్ర చాహల్​, కుల్దీప్​ యాదవ్​, మహ్మద్​ షమి, దీపక్​ చాహర్​, భువనేశ్వర్​ కుమార్​.

వన్డే జట్టు

టీ20 జట్టు

విరాట్​ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ​, కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్, రిషబ్​ పంత్​, మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​, శివమ్​ దూబే, జడేజా, వాషింగ్టన్​ సుందర్​, చాహల్​, కుల్దీప్​, దీపక్​ చాహర్​, భువనేశ్వర్​, షమి.

టీ20 జట్టు

ఇవే వేదికలు...

ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో భారత్‌.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి (డిసెంబరు 6), తిరువనంతపురం (డిసెంబరు 8)లో తొలి రెండు టీ20లు జరగనున్నాయి. డిసెంబరు 11న జరిగే ఆఖరి టీ20కి హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. డిసెంబరు 15న చెన్నైలో వన్డే సిరీస్‌ మొదలవుతుంది. రెండో మ్యాచ్‌ విశాఖపట్నం (డిసెంబరు 18)లో, మూడో మ్యాచ్‌ కటక్‌ (డిసెంబరు 22)లో జరుగుతాయి.

Last Updated : Nov 21, 2019, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details