ఈ ఏడాది దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. అయితే కోహ్లీ సారథ్యంలోని ఈ జట్టు వ్యూహాత్మకంగా ఆడాల్సిన అవసరముందని చెప్పాడు.
"స్టార్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి అధిక పరుగులు చేస్తాడు. తద్వారా మిడిల్ ఆర్డర్లో ఉన్న కోహ్లీ, ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా) మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. బౌలర్స్ కేన్ రిచర్డ్సన్(ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్(దక్షిణాఫ్రికా).. జట్టు బౌలింగ్‌ను సమతుల్యం చేస్తారు . కాబట్టి ఈ అంశాలు ఆర్సీబీకి కలిసొచ్చే అంశమని నా అభిప్రాయం."
-బ్రాడ్ హాగ్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్.