సిడ్నీ టెస్టులో టీమ్‌ఇండియా సారథిగా అజింక్య రహానె వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌ను ముందుగా పంపించడం వల్ల భారత్ సులువుగా మ్యాచ్‌ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు.
"రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడింది. కేవలం డ్రా కోసం కష్టపడాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు పంత్‌ను ముందుగా పంపించాలన్న రహానె తెలివితేటలు అద్భుతం. రిషబ్‌ను ముందు పంపించి ఆటను ముందుకు తీసుకెళ్లాలని రహానె భావించాడు. పంత్ అలాగే చేశాడు. నిర్భయంగా ఆడి టిమ్ పైన్ కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేసుకొనేలా ఆడాడు. అందుకే రహానె వ్యూహం గొప్పదని అంటున్నా."
- బ్రాడ్ హాడిన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్