తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టం: బిషప్ - సచిన్ వార్తల

సచిన్ తెందూల్కర్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషన్. తన టెక్నిక్​తో బంతిని మాస్టర్ సమర్థవంతంగా ఎదుర్కొంటాడని అన్నాడు.

సచిన్
సచిన్

By

Published : Jul 6, 2020, 11:42 AM IST

తనదైన బ్యాటింగ్‌తో రెండు దశాబ్దాలకుపైగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ బ్యాట్స్​మన్‌ సచిన్‌ తెందూల్కర్‌కు బౌలింగ్‌ చేయడం కష్టతరమని వెస్టిండీస్‌ మాజీ పేసర్‌, వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యులో మాట్లాడిన ఈ విండీస్‌ మాజీ ఆటగాడు లిటిల్‌మాస్టర్‌ గురించి ఇలా చెప్పాడు. తాను ఎదర్కొన్నవారిలో సచిన్‌ మాత్రమే తనకు ప్రత్యేకంగా కనిపించాడని అన్నాడు.

"నా కెరీర్‌లో నేను బౌలింగ్‌ చేసిన అత్యంత కష్టతరమైన బ్యాట్స్‌మెన్‌లో సచిన్‌ ఒకడు. అతనెప్పుడూ స్ట్రైట్‌డ్రైవ్‌లు ఆడతాడు. తన టెక్నిక్‌, సామర్థ్యంతో బంతిని బౌలర్‌ వెనక్కి పంపిస్తాడు"

-బిషప్‌, వెస్టిండీస్ మాజీ బౌలర్

లిటిల్‌ మాస్టర్‌తో కలిసి ఈ విండీస్‌ ఆటగాడు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో నాలుగు టెస్టులు కాగా ఐదు వన్డేలు ఉన్నాయి. ఇన్ని మ్యాచ్‌ల్లో బిషప్‌ మూడుసార్లే సచిన్​ను ఔట్‌ చేశాడు. అందులో రెండుసార్లు మాస్టర్ శతకానికి చేరువలో ఉండటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details