రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1-1 తో సిరీస్ సమమైంది. దీంతో బుధవారం జరిగే మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు, సిరీస్ సొంతం చేసుకుంటుంది.
ఆసీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు.. ఆ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం - AUS VS ENG ODI SERIES
ఆసీస్‌పై రెండో వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్‌ను సమం చేసింది. బుధవారం జరిగే నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు, సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
![ఆసీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు.. ఆ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం Bowlers shine as England fight back to beat Australia by 24 runs in 2nd ODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8791731-442-8791731-1600050132372.jpg)
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. రాయ్ (21), రూట్ (39), మోర్గాన్ (42), క్రిస్ వోక్స్ (26), టామ్ కరన్ (37), ఆదిల్ రషీద్ (35) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3 వికెట్లు తీయగా, స్టార్క్ 2, హేజిల్‌వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో ఆస్ట్రేలియా.. 48.4 ఓవర్లలో 207 పరుగులే చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (73), లబుషేన్(48), అలెక్స్ క్యారీ(36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగత బ్యాట్స్‌మెన్ విఫలమవడం వల్ల మ్యాచ్ ఓడిపోయింది కంగారూ జట్టు. ఇంగ్లీష్ బౌలర్లలో వోక్స్, ఆర్చర్, సామ్ కరన్ తలో మూడు వికెట్లు తీశారు. రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు.