దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు ఆరు పరుగుల తేడాతో నెగ్గింది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శిఖాపాండే(34), హర్మన్‌ప్రీత్(38) ఆకట్టుకునే ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏక్తా నిలవగా మరిజన్నె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శిఖా పాండే (35)తో కలిసి హర్మన్‌ప్రీత్ (38) ఆదుకుంది. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె (3/20), ఇస్మాయిల్ (2/18), ఖాకా (2/33) రాణించారు.