తెలంగాణ

telangana

ETV Bharat / sports

నా సత్తా ఏంటో ప్రత్యర్థులకు బాగా తెలుసు : గేల్​ - cwc2019

తన సత్తా గురించి ప్రత్యర్థి బౌలర్లకు బాగా తెలుసని అభిప్రాయం వ్యక్తం చేశాడు వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్​ క్రిస్​గేల్​. ఐసీసీ వన్డే ప్రపంచకప్​కు సన్నద్ధమవుతున్న వేళ ఈ కామెంట్​ చేశాడు.

నా సత్తా ఏంటో ప్రత్యర్థులకు తెలుసు : క్రిస్​గేల్​

By

Published : May 22, 2019, 5:22 PM IST

ప్రపంచ క్రికెట్​లో విధ్వంసకర బ్యాట్స్​మెన్​గా పేరున్న క్రిస్​గేల్..​ ఇంగ్లండ్​లో జరగనున్న ప్రపంచకప్​లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

"నా వికెట్​ తీసేందుకు చాలా మంది యువ బౌలర్లు ప్రయత్నిస్తుంటారు. విభిన్నంగా బంతులు వేసినా సరే.. క్రీజులో ఉన్నది గేల్‌ అన్న విషయం వాళ్లకు తెలుసు. నాకు బౌలింగ్‌ చేసే సమయంలో గేల్‌ అంతటి ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను చూడలేదని వాళ్లు మనసులో అనుకుంటారు. కానీ, కెమెరా ముందు మాత్రం గేల్‌ అంటే భయం లేదని చెప్తుంటారు. నిజానికి వాళ్ల మనసులో ఎంతో కొంత భయం ఉంటుంది. వాళ్లనే కెమెరా లేనప్పుడు అడిగితే.. అవును గేల్‌ ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ అని ఒప్పుకొంటారు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఎదుర్కోవడాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తాను. నా ఆట గురించి ఇంకా నిరూపించుకోవడానికి ఏం మిగల్లేదు. కేవలం నా అభిమానుల కోసమే ప్రపంచకప్‌ ఆడుతున్నా".
--క్రిస్​గేల్​, వెస్టిండీస్​ క్రికెటర్​

మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనేందుకు అన్ని జట్లు ఇంగ్లాండ్‌కు చేరుకుంటున్నాయి. ఐదోసారి ఈ మెగా టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. తనకు తానే యూనివర్స్‌ బాస్‌గా ప్రకటించుకున్న క్రిస్‌ గేల్‌.. ఈ ప్రపంచకప్‌లో బౌలర్లకు తనతో తిప్పలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు.

ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ విండీస్‌ వీరుడు 13 మ్యాచ్​ల్లో 490 పరుగులు చేశాడు. ఈ లీగ్​లో 326 సిక్స్​లు కొట్టిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. మే 31న జరగనున్న తొలి మ్యాచ్​లో పాకిస్థాన్​తో తలపడనుంది వెస్టిండీస్​ జట్టు.

ABOUT THE AUTHOR

...view details