భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతిగొప్ప సిరీస్ విజయంగా క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్న ఆసీస్ సిరీస్ ఎన్నో ఉత్కంఠభరితమైన పోరాటాలు, విజయగర్వం ఉప్పొంగించే విన్యాసాలు, జీవితకాలానికి సరిపోయే మధురానుభూతులు.. అన్నీ క్రికెట్ ప్రేమికుల గుండెల్లో కలకాలం మిగిలిపోతాయి. ఐతే ఈ అనుభూతులను శాశ్వతం చేసేలా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నడుం బిగించాడు. ఆసీస్ పర్యటన మొదలైన దగ్గర నుంచి భారత ఆటగాళ్ల ఆలోచనా తీరు, అపజయాలపై విశ్లేషణ, విజయాల కోసం ప్రణాళికలు, డ్రెస్సింగ్ రూం వాతావరణ ఇలా ప్రతీ విషయంపైనా టెస్టుల వారీగా విశ్లేషిస్తూ.. "కంగారూ భూమి" పేరుతో యూట్యూబ్‌లో వీడియోను రూపొందించాడు అశ్విన్. ఇందులో అశ్విన్, బౌలింగ్ కోచ్ శ్రీధర్ కలిసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పూర్తిగా తమిళంలో సాగిన ఈ సంభాషణను ఈటీవీ భారత్ తెలుగు క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేకంగా సిరీస్ రూపంలో అందిస్తోంది.
అశ్విన్:
అందరూ ఎంతో ఆసక్తిగా చూసిన భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ ఘనంగా ముగించాం. అసలు నమ్మశక్యం కాని విషయాలను సాధించి చూపించాం. నా 10-11 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పుడూ చూడనన్ని ప్రశంసలు అందుకున్నాం. ఈ సిరీస్ విజయానికి కారకులు ఎవరా అని అన్వేషించటం కష్టం. మొత్తం సభ్యుల శ్రమ ఇందులో ఉంది.
శ్రీధర్:
వందశాతం నిజం. ప్రతీ మ్యాచులో ప్రతీ మలుపులో ఓ కొత్త హీరో భారత్‌కు దొరికాడు. ఎప్పుడు జట్టుకు ఓ ఉత్సాహం కావాలో అప్పుడు ఎవరో ఒకరు ఆ బాధ్యతను తీసుకున్నారు.
అశ్విన్:
పింక్ బాల్‌తో ఆడిన అడిలైడ్ టెస్టుతో ఈ సంభాషణ ప్రారంభిద్దాం. అడిలైడ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్నాం. తర్వాత ఫీల్డింగ్‌లో దాదాపు 715 క్యాచులు జారవిడిచాం(సరదాగా).. ఫీల్డింగ్ కోచ్‌గా ఆ మ్యాచ్‌లో మీ పరిస్థితి ఏంటి?
శ్రీధర్:
ఆ మ్యాచ్ తర్వాత జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్ తెచ్చుకుంటారనిపించింది. దాదాపు నా ఉద్యోగం పోయిందనే భయపడ్డాను. తర్వాతి మ్యాచుకు ఉంటానా లేదా అనే విషయంపై సందేహాలు మొదలయ్యాయి. అంతకుముందు వన్డే సిరీస్ లోనూ ఇలాగే క్యాచులు నేలపాలు చేశారు. చాలా ప్రాక్టీస్ చేయించి అడిలైడ్ తీసుకువస్తే అక్కడా ఇలాగే చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే 7 వికెట్లు తీసినా అప్పటికే రెండు క్యాచులు వదిలేశారు. లబుషేన్వే రెండు క్యాచులు వదిలేయటం వల్ల నాకు టెన్షన్ మొదలైంది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే హెడ్ కోచ్ రవిశాస్త్రి వైపు చూశాను. ఆయన సీట్లో లేడు. చీకటి పడుతున్న సమయం.. డే నైట్ మ్యాచ్.. గులాబీ రంగు బంతి అసలు కనపడటం కష్టం. అడిలైడ్‌లో సీట్లన్నీ చాలా వరకూ ఎరుపు రంగులో ఉంటాయి. గాల్లో బంతి వచ్చేప్పుడు దాన్ని గుర్తించటం సవాల్ లాంటిదే. అలాంటి సమయంలో క్యాచులు వదిలేశారు. రవిశాస్త్రి కోసం చూస్తే ఆయన దాదాపు నేలమీదపడి పోయి అరుస్తున్నాడు. ఏమైంది అని నేను కంగారుపడేలోపు ఏంటయ్యా మనోళ్లు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేకలు పెడుతున్నాడు. నాకు ఈ సిరీస్‌లో కోచ్ బాక్స్‌కు సంబంధించి బాగా గుర్తుండిపోయే సందర్భమది. మీరంతా ఏదో కిందామీదాపడి 191కే వాళ్లను ఆలౌట్ చేశారు.
అశ్విన్: