తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌల్ట్ రికార్డు: టెస్టుల్లో  250 వికెట్లు - శ్రీలంక

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్​ 250వ వికెట్​ను ఖాతాలో వేసుకున్నాడు. వేగంగా ఈ ఘనత అందుకున్న రెండో కివీస్ బౌలర్​గా రికార్డు సాధించాడు.

బౌల్ట్​

By

Published : Aug 24, 2019, 6:01 AM IST

Updated : Sep 28, 2019, 1:52 AM IST

శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్​ అరుదైన రికార్డు సాధించాడు. కొలంబో వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్​లో 250వ వికెట్​ను ఖాతాలో వేసుకున్నాడు. వేగంగా ఈ ఘనత అందుకున్న రెండో కివీస్ బౌలర్​గా రికార్డు సృష్టించాడు. 64 టెస్టుల్లో 250 వికెట్లు తీశాడు.

ఓవర్​నైట్ స్కోరు 93/3తోశుక్రవారం బరిలోకి దిగిన శ్రీలంకను ఆరంభంలోనే దెబ్బతీశాడు బౌల్ట్​. ఆంజెలో మ్యాథ్యూస్​ను ఔట్ చేసి 250వ వికెట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. 245 వికెట్లతో సౌథి బౌల్ట్​కు దగ్గరలో ఉన్నాడు.

బౌల్ట్​ కంటే ముందు 1985లో సర్ రిచర్డ్ హాడ్లీ 53 టెస్టుల్లో 250 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన కివీస్ బౌలర్లలో బౌల్ట్​ మూడో స్థానంలో ఉన్నాడు. హాడ్లీ 431, డేనియల్​ వెటోరీ 361 వికెట్లతో అతడి కంటే ముందున్నారు.

ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. కరుణరత్నే(65) అర్ధశతకంతో రాణించగా.. కుశాల్ మెండీస్(32) ఫర్వాలేదనిపంచాడు. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(32), దిల్​రువా పెరీరా(5) ఉన్నారు. బౌల్ట్, సౌథి చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

ఇది చదవండి: 36 ఏళ్లనాటి రికార్డ్ బ్రేక్​ చేసిన సాయి ప్రణీత్

Last Updated : Sep 28, 2019, 1:52 AM IST

ABOUT THE AUTHOR

...view details