తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో టీ20లకు న్యూజిలాండ్ జట్టిదే

టీమిండియాతో జరిగే టీ20 సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ. హమీష్ బెన్నెట్​కు స్థానం లభించగా బౌల్ట్, ఫెర్గుసన్ గాయం కారణంగా దూరమయ్యారు.

Boult
టీ20

By

Published : Jan 16, 2020, 12:44 PM IST

టీమిండియాతో జరిగే ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ కమిటీ. విలియమ్సన్ సారథ్యంలో 14 మంది పేర్లను తెలిపింది. ఇందులో ఆశ్చర్యకరంగా వెటరన్ ఆటగాడు హమీష్ బెన్నెట్​కు స్థానం కల్పించింది. ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్ గాయం కారణంగా దూరమయ్యారు.

32 ఏళ్ల హమీష్ రెండున్నరేళ్ల క్రితం ముందు కివీస్ జట్టులో సభ్యుడు. 2011 ప్రపంచకప్​లోనూ ఆడాడు. అనంతరం చోటును కోల్పోయాడు. చివరగా 2017లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​ ఆడాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతుండటం, బౌల్ట్, ఫెర్గుసన్ గాయాలబారిన పడటం వల్ల ఇతడికి చోటు లభించింది.

జనవరి 24న న్యూజిలాండ్​తో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టులూ జరగనున్నాయి.

న్యూజిలాండ్ జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్, కొలిన్ డీ గ్రాండ్​హోమ్, మార్టిన్ గప్తిల్, స్టాట్ కుగ్గెలిజిన్, డారిల్ మిచెల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోధి, టిమ్ సౌథి

ఇవీ చూడండి.. టీమిండియా సూపర్ ఫ్యాన్ చారులత కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details