ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే సిరీస్‌ను యాషెస్‌గా అభివర్ణిస్తారు. దీనికి క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇరుజట్లు ఈ సిరీస్‌ను దేశ ప్రతిష్ఠగా భావిస్తాయి. అయితే ఈ సిరీస్లానే భారత్‌తో జరిగే బోర్డర్-గావస్కర్ సిరీస్ కూడా గొప్పదని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా. ఆస్ట్రేలియాకు యాషెస్ ఎంత ముఖ్యమో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కూడా అంతే ప్రధానమని తెలిపాడు.
"బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. యాషెస్‌తో సమానం. రెండు దీటైన జట్ల మధ్య జరిగే పోరు ఇది. 1986లో జరిగిన టెస్టు (డ్రా అయింది) నా కెరీర్లో అత్యుత్తమమైంది. 2001లో కోల్‌కతాలో జరిగిన టెస్టు (ఇందులో ఆసీస్ ఓడిపోయింది) ఇప్పటికీ జ్ఞాపకముంది. నాకు భారత్ అంటే చాలా ఇష్టం. అక్కడ క్రికెట్‌తో నాకు విడదీయరాని బంధం ఉంది. అలాగే భారత్‌లో క్రికెట్‌ను ఎందుకు అంతలా ఆదరిస్తారు అనే అంశంపై ఓ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది."
-స్టీవ్ వా, ఆసీస్ మాజీ కెప్టెన్