తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​లను ఆవిష్కరించిన కరీనా - కరీనా కపూర్​, సినీ నటి

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ ట్రోఫీలను బాలీవుడ్​ నటి కరీనా కపూర్ శుక్రవారం ఆవిష్కరించింది​. మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానం​లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది.

కరీనా చేతుల మీదుగా టీ20 ప్రపంచకప్​లు ఆవిష్కరణ

By

Published : Nov 1, 2019, 2:35 PM IST

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే పురుషులు, మహిళల టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను శుక్రవారం ఆవిష్కరించింది బాలీవుడ్​ నటి కరీనా కపూర్​. మెల్‌బోర్న్‌ క్రికెట్​ మైదానం​లో జరిగిన కార్యక్రమానికి ఈ ప్రముఖ నటి హాజరైంది. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

టీ20 ప్రపంచకప్​లు ఆవిష్కరించిన కరీనాకపూర్​

"టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీలను ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఆయా దేశాల జట్ల తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లు తమ కలను నెరవేర్చుకుంటున్నందుకు అభినందనలు. అంతర్జాతీయ వేదికపై వారు మరింత రాణించాలి".

--కరీనా కపూర్​, సినీ నటి

నటి కరీనా కపూర్​... భారత మాజీ సారథి దివంగత మన్సూర్​ అలీఖాన్ పటౌడీకి కోడలు కావడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళల ప్రపంచకప్​, అక్టోబర్​ 18 నుంచి నవంబర్​ 15 వరకు పురుషుల ప్రపంచకప్ మ్యాచ్​ల​ను నిర్వహించనుంది ఐసీసీ.

కరీనా, అక్షయ్​ కుమార్​ కాంబినేషన్​లో 'గుడ్​ న్యూస్​' అనే చిత్రం తెరకెక్కుతోంది. కియరా అడ్వాణీ, దిల్జీత్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు ఆమిర్​ సరసన 'లాల్​ సింద్​ చద్దా'లోనూ నటిస్తోందీ అమ్మడు.

ABOUT THE AUTHOR

...view details