క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులను తాజాగా ప్రకటించింది బీసీసీఐ. మాజీ క్రికెటర్లు మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌ను సీఏసీ సభ్యులుగా నియమించింది. లోథా కమిటీ నిబంధనల ప్రకారమే ఎంపీ గంభీర్‌కు ఇందులో చోటు దక్కలేదు. వీరందరూ ఏడాదిపాటు పదవుల్లో కొనసాగనున్నారు. వీరి మొదటి కర్తవ్యం జాతీయ సెలక్షన్ కమిటీని ఎంపిక చేయడం.
మదన్‌లాల్, సులక్షణా నాయక్, ఆర్పీ సింగ్ ట్రాక్ రికార్డు...
>> 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో మదన్‌లాల్ సభ్యుడు. ఇతడు 39 టెస్టులు, 67 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు జాతీయ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగానూ పనిచేశాడు.
>> ఆర్పీ సింగ్ టీమిండియాలో పేసర్‌గా రాణించాడు. 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2007లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఇతడు సభ్యుడు.
>> మహిళా క్రీడాకారిణి సులక్షణా నాయక్ మొత్తం 2 టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20లు ఆడింది. మొత్తం 11 ఏళ్లు భారత జట్టుకు సేవలందించింది.