బయోబబుల్‌లో మానసిక సమస్యలను ఎదుర్కోవటంలో ఇతర దేశాల ఆటగాళ్లతో పోల్చితే భారత ఆటగాళ్లు సహనపరులని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కొవిడ్ దృష్ట్యా బయోబబుల్‌లో ఉండటం ఎవరికైనా కష్టతరమేనని అన్నాడు.
'గత ఆరు నెలలుగా బయోబబుల్‌లో ఆడటం కష్టతరమే. కేవలం మైదానం నుంచి హోటల్ గదికి మాత్రమే పరిమితం కావటం విభిన్నమైన జీవితమే. విదేశీ ఆటగాళ్ల కన్నా భారత ఆటగాళ్లకు భరించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ఇండీస్తో నేను ఎన్నోసార్లు ఆడాను. వారు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోరు' అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు గంగూలీ.