టీ20 ప్రపంచకప్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకమవుతాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు ఓపెనింగ్ భాగస్వామిగా కేఎల్ రాహుల్‌ను ఎంచుకుంటానని పేర్కొన్నాడు.
"భువనేశ్వర్ కుమార్ ఫిట్‌నెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతడు కీలకమైన బౌలర్. ప్రత్యేకించి తెలుపు బంతి క్రికెట్లో అతడి అవసరం ఎంతో ఉంది. జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెడితే ఆరంభ, ఆఖరి ఓవర్లు వేసిన అనుభవం కేవలం భువీకి మాత్రమే ఉంది. అతడో కీలక సభ్యుడు. నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అందుకే అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాలి. అతడు వందశాతం ఫిట్‌నెస్‌తో ఉండటం అవసరం. ఇంగ్లాండ్ సిరీసులోనూ అతడు రెండు మ్యాచులే ఆడొచ్చు. మ్యాచుల మధ్య అతడికి విరామం ఇవ్వాలి."
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్