ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలతో తెరకెక్కుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కూడా తన బయోపిక్‌పై స్పందించాడు. ఒకవేళ తన జీవిత కథతో సినిమా తీస్తే అందులో బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావును హీరోగా పెడితే బాగుంటుందని తన మనసులోని మాట వెల్లడించాడు.
"నాకు, బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావుకు మధ్య పోలికలు ఉన్నాయని కొంతమంది చెప్పారు. అందుకే నా బయోపిక్‌లో అతడు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నా."
-భువనేశ్వర్ కుమార్, టీమ్ఇండియా క్రికెటర్