తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో​ టీ20 సిరీస్​: గప్తిల్ ఔట్ - out

ఫిబ్రవరి 6 నుంచి భారత్​తో జరిగే టీ-20 సిరీస్​కు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ దూరమయ్యాడు. బంగ్లాదేశ్​తో జరిగే మ్యాచ్​లకు అందుబాటులో ఉంటాడు ఈ స్టార్​ బ్యాట్స్​మన్.

గప్తిల్​

By

Published : Feb 4, 2019, 12:52 PM IST

ఫిబ్రవరి 6 నుంచి భారత్​తో జరిగే టీ ట్వంటీ సిరీస్​కు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత్​తో చివరి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడీ ఈ కివీస్​ ఓపెనర్​.

బంగ్లాదేశ్​తో జరిగే మ్యాచ్​లకు అందుబాటులో ఉండనున్నాడు గప్తిల్​.

ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్​కు గప్తిల్​ లేకపోవటం పెద్ద ఎదురుదెబ్బ. వెన్నునొప్పి కారణంగా భారత్​తో చివరి రెండు వన్డేలు ఆడని ఈ స్టార్ బ్యాట్స్​మన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.

"దురదృష్టవశాత్తు గప్తిల్ గాయం నుంచి కోలుకోలేదు. ఐదు రోజుల పాటు జరిగనున్న మూడు టీ20లు రసవత్తరంగా జరగబోతున్నాయి."

-న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టేడ్

ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు న్యూజిలాండ్ భారత్​తో మూడు టీ 20 మ్యాచ్​లు ఆడనుంది. వన్డే సిరీస్​లో గప్తిల్ స్థానంలో జిమ్మి నీషమ్ ఆడాడు. ఈ సిరీస్​కు ఆల్ రౌండర్ డారిల్ మిచెల్​నూ తీసుకున్నారు. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), డాగ్ బ్రాస్​వెల్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, లాకీ ఫెర్గ్యుసన్, స్కాట్ కుగ్లిజన్, డారిల్ మిచెల్, కొలిన్ మన్రో, జిమ్మి నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌధీ, రాస్ టేలర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details