టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ లాంటి లక్షణాలను ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్లోనూ చూస్తానని ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ అభిప్రాయపడ్డాడు. జులై 8 నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు జో రూట్ దూరమవుతున్నాడు. ఇందువల్ల స్టోక్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం రావొచ్చని తెలుస్తోంది.
"కోహ్లీ తన జట్టు కోసం ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అందరూ తమ జట్టు కోసం అలానే చేయాలనుకుంటారు. విరాట్‌లాగే స్టోక్స్, తన బాధ్యత కచ్చితంగా నిర్వర్తిస్తాడని అనుకుంటున్నా. బెన్ నా కంటే గొప్పగా కెప్టెన్సీ చేస్తాడని నా నమ్మకం. జట్టును ముందుండి నడిపించడం లాంటి గొప్ప లక్షణం అతడిలో ఉంది. ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా స్టోక్స్‌పై అందరికి చాలా గౌరవం ఉంది. జులైలో జరగబోయే టెస్టు సిరీస్‌లో తాను అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నా"
-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్