తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2020, 3:35 PM IST

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్: నెంబర్ వన్ ఆల్​రౌండర్​గా స్టోక్స్

ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఆల్​రౌండర్ల విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. విండీస్ కెప్టెన్ హోల్డర్ రెండో ప్లేస్​కు పడిపోయాడు.

నెంబర్ వన్ ఆల్​రౌండర్​గా బెన్ స్టోక్స్
నెంబర్ వన్ ఆల్​రౌండర్​గా బెన్ స్టోక్స్

తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఆల్​రౌండర్ల విభాగంలో నెంబర్ ర్యాంకుకు చేరుకున్నాడు. వెస్టిండీస్​తో జరిగిన రెండో టెస్టులో బ్యాట్​తోనే కాక బంతితోనూ రాణించాడు స్టోక్స్. ఫలితంగా విండీస్ కెప్టెన్​ జాసన్ హోల్డర్​ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రస్తుతం హోల్డర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య 38 పాయింట్ల తేడా ఉంది. అలాగే బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లోనూ మూడో స్థానానికి చేరుకున్నాడు స్టోక్స్.

వెస్టిండీస్​తో జరిగిన రెండో టెస్టులో 254 పరుగులతో పాటు 3 వికెట్లు సాధించాడు స్టోక్స్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది.

ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఆల్​రౌండర్ల విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. అలాగే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 120 పరుగులతో రాణించిన డామ్ సిబ్లే 29 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంకుకు చేరుకున్నాడు. మొదటి టెస్టుకు దూరమై రెండో మ్యాచ్​లో మంచి ప్రదర్శన కనబర్చిన బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తిరిగి టాప్​-10లో చోటు దక్కించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details