ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఐపీఎల్ జట్టు సహచరుడు బెన్ స్టోక్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లీష్ ఆల్‌రౌండర్లు ఎటువంటి కఠిన పరిస్థితులనైన ఎదుర్కొంటారని అన్నాడు. అందువల్లే స్టోక్స్ వంటి ఆటగాడిని ప్రతి కెప్టెన్ తమ జట్టులో ఉండాలని కోరుకుంటారని స్మిత్ పేర్కొన్నాడు.
"స్టోక్స్ ఆటను నేను చూశా. అతను ఎంతో గొప్ప ఆటగాడు. ప్రపంచకప్, ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్‌లో ఎంతో బాగా ఆడాడు. అంతే కాదు, ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా అన్నింట్లోనూ తన చేయి ఉండాలని కోరుకుంటాడు. స్టోక్స్ ఎప్పుడూ ప్రముఖ ఆటగాళ్లలో ఒకడిగా ఉండాలనుకుంటాడు. కఠిన పరిస్థితుల్లో జట్టును కాపాడేందుకు ఇటువంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం ఎంతో ముఖ్యం."