తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​కు పితృవియోగం - బెన్​స్టోక్స్​ తండ్రి గెరాడ్​ స్టోక్స్​ మృతి

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ తండ్రి రగ్బీ మాజీ ఆటగాడు గెరాడ్​ స్టోక్స్​ మరణించారు. ఏడాది నుంచి బ్రెయిన్​ కాన్సర్​తో బాధపడుతున్న గెరాడ్.. చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Ben Stokes' father Ged passes away after year-long battle with brain cancer
ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​కు పితృవియోగం

By

Published : Dec 8, 2020, 8:57 PM IST

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ తండ్రి గెరాడ్​ స్టోక్స్​ మరణించారు. ఏడాది కాలంగా బ్రెయిన్​ కాన్సర్​తో బాధపడుతున్న గెరాడ్​ స్టోక్స్​ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గెరాడ్​కు చెందిన వర్కింగ్​టన్​ రగ్బీ టీమ్ ట్విట్టర్​లో ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటించింది. ఈ రుగ్మతకు చికిత్స పొందడానికి కొన్ని నెలల క్రితమే స్టోక్స్​ కుటుంబం న్యూజిలాండ్​ చేరుకుంది. తన తండ్రికి చికిత్స చేయించడానికి న్యూజిలాండ్​ వెళ్లిన బెన్​స్టోక్స్​.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్​లో ఆలస్యంగా పాల్గొన్నాడు.

బెన్​స్టోక్స్​ తల్లిదండ్రులు (పాత చిత్రం)

స్టోక్స్​ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్ కోసం అక్కడే ఉన్నాడు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్​లో ఇంగ్లాండ్​ జట్టు క్లీన్​స్వీప్​ చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్​ సిబ్బందిలో కరోనా కేసులు బయటపడడం వల్ల వన్డే సిరీస్​ను ఇరు దేశాల క్రికెట్ జట్లు వాయిదా వేశాయి. కేప్​టౌన్ నుంచి​ గురువారం తమ జట్టు బయలుదేరుతుందని ఇంగ్లాండ్​ బోర్డు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details