ఇటీవలే కాలంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడుతున్న ఆ దేశ క్రికెటర్ దినేశ్ కనేరియా.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. 2012లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఇతడిపై శాశ్వత నిషేధం విధించారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఆటగాళ్లకు శిక్షలు తగ్గించి, క్రికెట్లోకి తిరిగి అనుమతిస్తున్నారని.. తన విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేయడం లేదని ప్రశ్నించాడు.
"అవినీతికి పాల్పడితే ఎటువంటి తారతమ్యాలు చూడమని చెప్పారు. ఉమర్ అక్మల్ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కానీ అతనిపై ఉన్న నిషేధంపై సడలింపులు విధించి శిక్ష తగ్గించారు. ఆమిర్, ఆసిఫ్, సల్మాన్లకూ తిరిగి క్రికెట్ ఆడేందుకు అనుమతినిచ్చారు. మరి నన్నెందుకు వదిలేయడం లేదు? సడలింపులు ఎందుకు కల్పించడం లేదు? నాపై వివక్ష చూపుతున్నారని ఇక్కడే స్పష్టంగా తెలిసిపోతోంది"