భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం తన ట్విట్టర్‌లో ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. విరాట్‌తో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు వర్షంలో తడుస్తుండగా.. కోహ్లీకి ఎదురుగా ధోనీ కనిపించాడు.
"క్రైమ్‌లో భాగస్వాములం. బౌండరీల వద్ద ఫీల్డర్స్ నుంచి డబుల్స్ దొంగిలిస్తాం. ఎవరో చెప్పండి" అని కింగ్ కోహ్లీ కామెంట్ పెట్టాడు.
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు గురువారం జట్టును ప్రకటించనున్నారు సెలెక్టర్లు. ఈ మేరకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ.. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. అయితే విండీస్‌తో సిరీస్‌కు ధోనీ అందుబాటులో ఉంటాడా..లేదా..! అన్న విషయంపై ఈ భేటీ తర్వాత స్పష్టత వస్తుంది. తాజాగా కోహ్లీ ట్వీట్ చూసిన నెటిజన్లు.. మహీ వస్తున్నాడని ట్విట్టర్లో కామెంట్లు పెడుతున్నారు.
సర్వం సిద్ధం...
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం(నవంబర్ 22న) బంగ్లాతో డేనైట్ టెస్టు ఆడనుంది కోహ్లీ సేన. ఇప్పటికే స్టేడియం పరిసరాలను అందంగా అలంకరించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ గులాబి బంతి టెస్టు జరగనుంది.