మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా మెల్బోర్న్ రెనేగేడ్స్తో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయాన్నిఅందరూ ఆస్వాదిస్తుండగా.. ఆ జట్టు బౌలర్ అమాండా వెల్లింగ్టన్కు పెళ్లి ప్రతిపాదన చేశాడు ఆమె స్నేహితుడు టేలర్. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.
అమాండా వెల్లింగ్టన్ - టేలర్ చాలాకాలంగా స్నేహితులు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మోకాళ్లపై వంగి ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు టేలర్. ఉంగరం తొడిగాడు. వెంటనే అతడిని చుంబించి తన అంగీకారాన్ని తెలియజేసిందీ క్రికెటర్.