తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పునరాగమనంపై ఆలోచన వద్దు.. ఓపిక ముఖ్యం'

గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యకు సలహాలిచ్చాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్. జట్టులోకి పునరాగమనంపై ఎక్కువగా ఆలోచించకుండా ఓపికగా ఉండాలని సూచించాడు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య

By

Published : Feb 4, 2020, 5:45 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నా ఫిట్​నెస్​ లేని కారణంగా న్యూజిలాండ్ పర్యటనకు సెలక్టర్లు ఇతడిని ఎంపిక చేయలేదు. దీనిపై స్పందించాడు మాజీ బౌలర్ జహీర్ ఖాన్. జట్టులోకి పునరాగమనంపై ఎక్కువగా ఆలోచించొద్దని పాండ్యకు సలహా ఇచ్చాడు.

"ఐపీఎల్​కు ఇంకా సమయముంది. అప్పటివరకు హార్దిక్ ఫిట్​నెస్ సాధిస్తాడని అనుకుంటున్నా. ఏ ఆటగాడైనా గాయపడితే ఎప్పుడు జట్టులోకి వస్తామనే విషయం కాకుండా ఎలా జట్టులోకి రావాలా అని ఆలోచిస్తుంటాడు. ఈ సమయంలో ఓపికగా ఉండటం ముఖ్యం. జట్టు, సహాయ సిబ్బంది, డాక్టర్, ఫిజియో, ట్రైనర్ చెప్పిన విషయాల్ని పాటించాలి."
-జహీర్ ఖాన్, టీమిండియా మాజీ పేసర్

న్యూజిలాండ్​లో జరిగిన టీ20 సిరీస్​ను 5-0తో గెలవడం చాలా గొప్ప విషయమని అన్నాడు జహీర్. కివీస్ గడ్డపై వన్డే సిరీస్​ రూపంలో కోహ్లీసేనకు కఠిన సవాలు ఎదురుకానుందని చెప్పాడు. ఇదే జోరును కొనసాగించి వన్డే, టెస్టు సిరీస్​లను కైవసం చేసుకోవాలని సూచించాడు.

ఇవీ చూడండి.. ధోనీ అందుకే ఉత్తమ కెప్టెన్: రోహిత్

Last Updated : Feb 29, 2020, 2:22 AM IST

ABOUT THE AUTHOR

...view details