అక్టోబరు-నవంబరులో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని అస్త్రాల్ని ప్రయోగిస్తోంది. అదే సమయంలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా కోసం ఐసీసీలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా దక్షిణాఫ్రికా బోర్డుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆగస్టు చివర్లో సఫారీ గడ్డపై 3 టీ20లు ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ సుముఖత - టీ20 ప్రపంచకప్ న్యూస్
ఐపీఎల్ నిర్వహణకు అనేక దేశాల క్రికెట్ బోర్డుల నుంచి సహకారం కోసం అడుగులేస్తోంది బీసీసీఐ. టీ20 ప్రపంచకప్ వాయిదా కోసం ఐసీసీలో మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్ ఆడేందుకు సముఖత వ్యక్తం చేసింది.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గితే టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పొట్టి సిరీస్ నిర్వహణకు ముందుకు సాగాలని ఇరుదేశాల బోర్డులు నిర్ణయించాయి. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకే ఈ సిరీస్ అని చెప్తున్నా.. ఊహించని విధంగా సఫారీ పర్యటన తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ భవిష్యత్తుపై ఈనెల 28న జరిగే సమావేశంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచకప్ వాయిదా పడితే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందన్నది బీసీసీఐ ఆలోచన. ఈనేపథ్యంలో ఆయా బోర్డులను మచ్చిక చేసుకునే పనిలో భాగంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బోర్డు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి..'ఐసీసీ ఛైర్మన్గా గంగూలీకి మద్దతిస్తాం'