తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటగాళ్ల బకాయిల చెల్లింపుల్లో బీసీసీఐ ఆలస్యం!

ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్​ బోర్డుగా ప్రసిద్ధి చెందిన బీసీసీఐ.. 10 నెలలకు పైగా క్రికెటర్ల బకాయిలను చెల్లించలేదని తెలుస్తోంది. ఓ నివేదిక తెలిపిన సమాచారం ప్రకారం జీతాలకు చెందిన పలు విషయాలు వెల్లడయ్యాయి.

BCCI
బీసీసీఐ

By

Published : Aug 2, 2020, 11:42 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ బోర్డు ఏదైనా ఉందంటే అది బీసీసీఐ. ఇంతటి సంపన్న బోర్డు.. క్రికెటర్లకు బకాయిలు చెల్లించడంలో ఆలస్యం వహిస్తోంది. గతేడాది అక్టోబరు నుంచి 27 మంది కాంట్రాక్టు ఆటగాళ్లకు త్రైమాసిక చెల్లింపులు​ లభించలేదని నివేదికలు వెల్లడించాయి. అంతే కాకుండా 2019 నుంచి రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడిన ఆటగాళ్లకు ఇంకా మ్యాచ్​ బకాయిలు అందలేదని తెలుస్తోంది.

వీరిలో ఏ ప్లస్​ కేటగిరీలో విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, జస్​ప్రీత్​ బూమ్రా ఉన్నారు. బీసీసీఐ చివరి బ్యాలెన్స్​ షీట్​ ప్రకారం.. 2018 మార్చి నాటికి రూ.5,526 కోట్ల బ్యాంక్​ బ్యాలెన్స్​ ఉంది. స్థిర డిపాజిట్లలో రూ.2,992 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు స్టార్ టీవీతో రూ.6,138.1 కోట్లతో ఐదేళ్ల వరకు ప్రసార ఒప్పందం కుదుర్చుకుంది.

డిసెంబరు నుంచి బీసీసీఐకి ఫైనాన్షియల్​ అధికారి లేరు. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు చెల్లింపులు ఆలస్యం అయ్యుండొచ్చని నివేదికలు పేర్కొన్నాయి. అయితే కాంట్రాక్టు ఆటగాళ్లు మాత్రం తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. మరోవైపు దేశీయ ఆటగాళ్లకూ ఈ కష్టాలు తప్పట్లేదు.

ABOUT THE AUTHOR

...view details