తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండు వారాల క్వారంటైన్​లో టీమిండియా క్రికెటర్లు - క్వారంటైన్​లో టీమిండియా క్రికెటర్లు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు ముందు భారత్ క్రికెటర్లను రెండువారాలు క్వారంటైన్​లో ఉంచేందుకు సిద్ధమని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.

'టీమిండియా క్రికెటర్లు క్వారంటైన్​లో ఉండాల్సిందే'
భారత్ క్రికెటర్లు

By

Published : May 8, 2020, 5:20 PM IST

భారత్​-ఆస్ట్రేలియా మధ్య ఈ నవంబరులో టెస్టు సిరీస్​ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిరీస్​​ నిర్వహణపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో స్పందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. మ్యాచ్​లు ప్రారంభానికి రెండు వారాల ముందు టీమిండియా క్రికెటర్లను రెండు వారాలు క్వారంటైన్​లో ఉంచేందుకు సిద్ధమని తెలిపింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ (పాత చిత్రం)

ఇదే విషయమై తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. రెండు వారాల క్వారంటైన్​కు సిద్ధంగా ఉన్నామని, క్రికెట్ ప్రారంభమవ్వాలంటే ఇలాంటివి తప్పవని అభిప్రాయపడ్డారు.

ఈ సిరీస్​ కంటే ముందు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్​ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ వైరస్​ విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నీ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అప్పటికి పరిస్థితి సర్దుకున్నా, ఇతర దేశాల బోర్డులు.. తమ ఆటగాళ్లను అక్కడికి పంపిస్తాయా? అనేది సందేహంగా మారింది.

కరోనా వల్ల భారత్​లో ప్రస్తుతం క్రికెట్​కు సంబంధించిన ఏ కార్యక్రమాలు జరగడం లేదు. ఐపీఎల్ 13వ సీజన్​నూ ఇప్పటికే నిరవధిక వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details