తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ X వెస్టిండీస్​: భాగ్యనగరంలోనే తొలి టీ20 - swap dates of T20Is india vs Windies

భారత్-వెస్టిండీస్ మధ్య డిసెంబర్​ 6న  జరగనున్న తొలి టీ20 వేదిక మారింది. భద్రతా కారణాల రీత్యా మ్యాచ్​ వేదికను ముంబయి నుంచి హైదరాబాద్​కు మార్చింది బీసీసీఐ. డిసెంబర్​ 11న భాగ్యనగరంలో జరిగే మ్యాచ్​ ముంబయిలో నిర్వహించనున్నారు.

భారత్ X వెస్టిండీస్​: హైదరాబాద్​లో తొలి టీ20

By

Published : Nov 23, 2019, 6:30 AM IST

భారత్‌, వెస్టిండీస్‌ టీ20 షెడ్యూల్​లో చిన్న మార్పు చేసింది బీసీసీఐ. తొలి మ్యాచ్‌ వేదికను ముంబయి నుంచి హైదరాబాద్​కు తరలించింది. మ్యాచ్‌ నిర్వహణకు సరిపడా భద్రతా సిబ్బందిని కేటాయించలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఇదీ జరిగింది...

షెడ్యూలు ప్రకారం డిసెంబర్‌ 6న వాంఖడేలో మ్యాచ్‌ జరగాలి. అది బాబ్రీ మసీద్‌ కూల్చివేసిన దినం. దీనికి తోడు అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి ప్రజలు ఇక్కడ సమావేశం కానున్నారు. కాబట్టి ఎలాంటి అల్లర్లు జరగకుండా నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు డిసెంబర్‌ 6న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి. ఇందుకు వేలాది మంది హాజరై 'మహాపరినిర్వాణ్‌ దివస్‌'గా జరుపుకొంటారు.

ఈ రెండు కార్యక్రమాలకు వేల సంఖ్యలో బలగాలను నగరంలో మోహరించాల్సి ఉంటుంది. అందువల్లే మ్యాచ్‌ నిర్వహణకు పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బందిని కేటాయించలేమని ముంబయి క్రికెట్‌ సంఘానికి వెల్లడించింది అక్కడి పోలీసు విభాగం. ఫలితంగా డిసెంబర్‌ 6 మ్యాచ్‌ను హైదరాబాద్‌కు, 11న అక్కడ జరగాల్సిన మ్యాచ్‌ను ముంబయికి మార్చింది బీసీసీఐ. ఇరుజట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

వేదికలు ఇవే...

  • హైదరాబాద్​ (డిసెంబరు 6), తిరువనంతపురం (డిసెంబరు 8)లో తొలి రెండు టీ20లు జరగనున్నాయి. డిసెంబరు 11న జరిగే ఆఖరి టీ20కి ముంబయి ఆతిథ్యమివ్వనుంది.
  • డిసెంబరు 15న చెన్నైలో వన్డే సిరీస్‌ మొదలవుతుంది. రెండో మ్యాచ్‌ విశాఖపట్నం (డిసెంబరు 18)లో, మూడో మ్యాచ్‌ కటక్‌ (డిసెంబరు 22)లో జరుగుతాయి.

వన్డే, టీ20 జట్టు:

విరాట్​ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ​, కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్, రిషబ్​ పంత్​, మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​, శివమ్​ దూబే, జడేజా, చాహల్​, కుల్దీప్​, దీపక్​ చాహర్​, భువనేశ్వర్​, షమి.

రెండు సిరీస్​లకు 14 మంది ఉండగా.... టీ20ల్లో కేదార్​ జాదవ్​కు బదులు వాషింగ్టన్​ సుందర్​ను తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details