కరోనా ప్రభావం భారత దేశవాళీ క్రికెట్‌పై గట్టిగానే పడ్డట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ భయంతో ఈ ఏడాది దేశవాళీ టోర్నీలు, బీసీసీఐ నిర్వహించేలా కనిపించట్లేదు. మ్యాచ్‌లు కుదించి రంజీ ట్రోఫీ అయినా జరుపుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దేశంలో వైరస్ ఉద్ధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదంతా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
"దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూణ్నాలుగు నెలల పాటు సాగే దేశవాళీ టోర్నీలు ఎలా నిర్వహించగలరు?"