పాక్ చెర నుంచి విడుదలైన వింగ్ కమాండర్‌కు స్వాగతం పలుకుతూ బీసీసీఐ ట్వీట్ చేసింది. అభినందన్ పేరుతో రూపొందించిన జెర్సీని పెట్టి.. "స్వాగతం అభినందన్.. మీరు మా హృదయాలు గెలుచుకున్నారు" అంటూ ట్వీట్ చేసింది.
వీరుడా స్వాగతం - bcci
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రాకతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు నెట్టింట్లో ఘనస్వాగతం పలికారు.
అభినందన్ పేరుతో జెర్సీ
హీరో అనేది నాలుగక్షరాల పదం కాదు.. ధైర్యం, నిస్వార్థం, పట్టుదల అంటూ సచిన్ తెందూల్కర్ చెప్పుకొచ్చాడు.
మీరే నిజమైన హీరో, మీరు చూపిన ధైర్యం, గౌరవానికి దేశం మీకు సెల్యూట్ చేస్తుంది అని సానియా మీర్జా ట్వీట్ చేసింది