రానున్న రంజీ సీజన్ నాకౌట్ మ్యాచ్ల్లో డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ). గత సీజన్లలో అంపైర్ల తప్పిదాలు, మరోసారి జరగకుండా నివారించొచ్చని పేర్కొంది.
గత రంజీ సీజన్లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు చాలానే జరిగాయి. సెమీస్లో కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచే దీనికి ఉదాహరణ. వీటన్నింటిని నివారించేందుకే రంజీల్లో డీఆర్ఎస్ పద్దతి ప్రవేశపెట్టనున్నామని బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీమ్ చెప్పారు.
"అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తప్పిదాలను నివారించాలని చూస్తున్నాం. రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ల్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టనున్నాం. ఫీల్డ్ అంపైర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది." -సబా కరీమ్, బీసీసీఐ జనరల్ మేనేజర్