తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫిర్యాదు చేస్తేనే బంగర్​పై చర్యలుంటాయి​' - bcci

సెలక్టర్​ దేవాంగ్​ గాంధీతో భారత జట్టు మాజీ బ్యాటింగ్​ కోచ్​ సంజయ్​ బంగర్​ అమర్యాదగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంపై బీసీసీఐ స్పందించింది. ఈ విషయంపై మేనేజర్, ప్రధాన కోచ్​ నుంచి అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

'ఫిర్యాదు చేస్తేనే బంగర్​పై చర్యలుంటాయ్​'

By

Published : Sep 4, 2019, 5:39 PM IST

Updated : Sep 29, 2019, 10:40 AM IST

ప్రపంచకప్​ తర్వాత టీమిండియా బ్యాటింగ్​ కోచ్​గా సంజయ్​​ బంగర్​ పదవీకాలం ముగిసింది. మళ్లీ ఎంపిక​ చేపట్టిన ఎమ్మెస్కే ప్రసాద్​ నేతృత్వంలోని కమిటీ.. నూతన బ్యాటింగ్​ కోచ్​గా విక్రమ్​ రాఠోడ్​కు నియమించింది.ఈ నిర్ణయంపై అసంతృప్తికి లోనైన బంగర్​... కమిటీలోని సభ్యుడు దేవాంగ్​ గాంధీతో అమర్యాదకరంగా వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

కోచ్​ రవిశాస్త్రి, మేనేజర్​ సుబ్రహ్మణ్యం

" ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. దేవాంగ్ గాంధీతో అమర్యాదగా ప్రవర్తించినట్లుసంజయ్​ బంగర్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా ఈ విషయంపై భారత జట్టు మేనేజర్​ సుబ్రహ్మణ్యం లేదా రవిశాస్త్రి నుంచి అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం ". -బీసీసీఐ అధికార ప్రతినిధి

ఈ సంఘటన నిజమేనని వీరిద్దరిలో ఎవరు ధ్రువీకరించినా వ్యవహారం క్రికెట్​ పాలక కమిటీ(సీఓఏ) దృష్టికి వెళ్తుంది. అప్పుడు బంగర్​పై ఎలాంటి శిక్ష వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఘటనలు క్రీడా నిబంధనలు ఉల్లంఘించడమేనని బీసీసీఐ భావిస్తోంది.

" వేటు పడితే సహజంగా ఎవరికైనా బాధేస్తుంది. అయితే సెలక్టర్లను ప్రశ్నించడం, వ్యక్తిగత దూషణలకు దిగే అధికారం ఎవరికీ లేదు. " -బీసీసీఐ అధికార ప్రతినిధి

ప్రపంచకప్​ తర్వాత ప్రధాన కోచ్​గా మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది కపిల్​దేవ్​ నేతృత్వంలోని క్రికెట్​ సలహా కమిటీ. సహాయ సిబ్బంది ఎంపిక మాత్రం ఎమ్మెస్కే ప్రసాద్​ నేతృత్వంలోని సెలక్షన్​ కమిటీ చేపట్టింది. ఫీల్డింగ్​ కోచ్​గా శ్రీధర్​, బౌలింగ్​ కోచ్​గా భరత్​ అరుణ్​కు మరోసారి చోటు దక్కినా... బ్యాటింగ్​ కోచ్​ బంగర్​పై వేటు పడింది.

సెలక్టర్ల బృందం(ఎమ్మెస్కే ప్రసాద్​,దేవాంగ్​,గగన్​)

సెలక్టర్లు సమాధానమివ్వరు..!

ఎంపిక కాని కోచ్​లు, ఆటగాళ్లు కొందరు ఈ మధ్య కాలంలో సెలక్టర్లపై సోషల్​ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రంజీల్లో 850కి పైగా పరుగులు చేసిన తనను దులీప్​ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడమేంటని సౌరాష్ట్ర క్రికెటర్​ షెల్డన్​ జాక్సన్​, సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాడు. పరుగుల జాబితాలో 39వ స్థానంలో ఉన్న బంగాల్​ ఆటగాడు మనోజ్​ తివారీ కూడా జట్టులోకి తనను ఎంపిక చేయలేదని అసహనం వ్యక్తం చేశాడు. వీరిని తిరస్కరించడంపై సెలక్టర్లు బహిరంగ వివరణ ఇవ్వలేదు. అయితే ప్రశ్నించే సహాయ సిబ్బంది, ఆటగాళ్లపై చర్యలు తీసుకొనే అంశంపైనా ఓ విధానం రూపొందించేందుకు సీఓఏ(క్రికెట్ పాలక కమిటీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Last Updated : Sep 29, 2019, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details