తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్2020: నేడో రేపో లీగ్‌ షెడ్యూల్‌! - ఐపీఎల్ షెడ్యూల్

ఐపీఎల్​కు అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. మ్యాచ్​ల నిర్వహణపై ఎమిరేట్స్​ క్రికెట్ బోర్డు చీఫ్​తో బీసీసీఐ చర్చలు జరిపింది. దీంతో నేడో రేపో లీగ్ షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.

నేడో రేపో ఐపీఎల్‌ షెడ్యూల్‌!
నేడో రేపో ఐపీఎల్‌ షెడ్యూల్‌!

By

Published : Aug 29, 2020, 6:33 AM IST

ఐపీఎల్‌-13 షెడ్యూల్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లే. దుబాయ్‌, అబుదాబి, షార్జాలలో మ్యాచ్‌ల నిర్వహణపై ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చీఫ్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌తో బీసీసీఐ ప్రతినిధుల చర్చలు పూర్తయ్యాయి. ఆయన జోక్యంతో నగరాల మధ్య ప్రయాణాలతో సహా అన్ని సమస్యలు పరిష్కారమవడం వల్ల ఐపీఎల్‌ షెడ్యూల్‌కు మార్గం సుగమమైంది. నేడో రేపో ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల అవ్వొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details