తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆగస్టులో టీమిండియా కొత్త కోచ్ ప్రకటన - ravishastri

భారత జట్టు కోచ్, సహాయ సిబ్బంది పదవులకు దరఖాస్తులను జులై 30 వరకు ఆహ్వానించనుంది బీసీసీఐ. ఆగస్టు 2, 3 వారాల్లో కోచ్​ ఎవరనేది ప్రకటించనుంది.

బీసీసీఐ

By

Published : Jul 26, 2019, 6:46 AM IST

టీమిండియా కోచ్, సహాయ సిబ్బంది పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దరఖాస్తులను జులై 30 వరకు తీసుకోనుంది బీసీసీఐ. అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఆగస్టు రెండు, మూడు వారాల్లో కోచ్ ఎవరనేది ప్రకటించనుంది.

ఈ పదవికి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మళ్లీ దరఖాస్తు చేశాడు. టీమిండియాతో కలిసి విండీస్ పర్యటనకు వెళ్లనున్నాడు రవిశాస్త్రి. ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ హాజరు కాలేరు కావున.. స్క్రైప్ ద్వారా మౌఖిక పరీక్షకు అందుబాటులో ఉంటాడని సమాచారం.

రవిశాస్త్రి

రవిశాస్త్రి, ఇతర సహాయ సిబ్బంది ఉద్యోగ ఒప్పందం జులై నెలతో పూర్తి కానుంది. వీరి కాలపరిమితిని 45 రోజుల పాటు బీసీసీఐ ఇంతకుముందే పొడింగించింది.

ఇది చదవండి: మరోసారి జోడిగా ఆడుతున్న ముర్రే బ్రదర్స్

ABOUT THE AUTHOR

...view details