భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండటం వల్ల బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వయో విభాగాల క్రికెట్ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. త్వరలో జరగనున్న వినూ మన్కడ్ ట్రోపీతో సహా అన్ని టోర్నీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం అందించారు.
కరోనా కలవరం.. టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ - వినూ మన్కడ్ టోర్నీ రద్దు
భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తుండటం వల్ల పలు టోర్నీలు రద్దు చేసింది బీసీసీఐ. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సమాచారం అందించారు.
![కరోనా కలవరం.. టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ BCCI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11038879-369-11038879-1615943463869.jpg)
బీసీసీఐ
అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా భారత్- ఇంగ్లాండ్ టీ20 సిరీస్ జరుగుతోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మంగళవారం జరిగిన మూడో టీ20 ప్రేక్షకులు లేకుండానే జరిగింది. మిగతా మ్యాచ్‌లను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే తెలిపింది.