టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. మంచి అవకాశం దక్కించుకున్నాడు. బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ)లో ఓ సభ్యుడిగా ఎంపికయ్యాడు. వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. గౌతీతో పాటు 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మదన్‌లాల్‌కు మరో సభ్యుడిగా చోటు దక్కింది. ముగ్గురితో కూడిన ఈ కమిటీకి మదన్ నాయకత్వం వహించే అవకాశముంది.
సీఏసీలో సభ్యులుగా గంభీర్, మదన్‌తోపాటు మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ సింగ్ ఎంపికవునుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వీరు త్వరలో కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. వీరితోపాటే ఉన్న శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపేలకు ఓ ఏడాది పదవీకాలముంది.