మే 30న ప్రారంభం కానుంది క్రికెట్ ప్రపంచకప్. ఆ మెగాటోర్నీకి వెళ్లే భారత జట్టును నేడు ప్రకటించనుంది బీసీసీఐ. జట్టులో ఉండే 15 మంది ఎవరోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చాలా మంది పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉండగా.. నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా రెండో వికెట్ కీపర్‌గా పంత్, దినేశ్ కార్తిక్‌లలో ఎవరు ఉంటారో తెలియాల్సి ఉంది.
నాలుగో స్థానం కోసం రాయుడు, కేఎల్ రాహుల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో హర్దిక్ పాండ్యకే చోటు దక్కే అవకాశం ఉంది.