తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాహాను రంజీల్లో​ ఆడొద్దని బీసీసీఐ ఆదేశం..! - టీమిండియా టెస్టు కీపర్​ సాహా క్రికెట్​ ఆడొద్దా...!

భారత జట్టులో 'ఫ్లయింగ్​ మ్యాన్'​గా పేరు తెచ్చుకున్న కీపర్​ సాహా.. రంజీల్లో ఆడేందుకు వీల్లేదంటోంది బీసీసీఐ. దేశవాళీ మ్యాచ్​ల్లో ఆడేందుకు సిద్ధమవుతున్న ఇతడికి తాజాగా షాకిచ్చింది భారత బోర్డు.

Wriddhiman Saha
టీమిండియా టెస్టు కీపర్​ సాహా క్రికెట్​ ఆడొద్దా...!

By

Published : Jan 23, 2020, 7:01 AM IST

Updated : Feb 18, 2020, 1:59 AM IST

భారత సీనియర్​ వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహాకు.. బీసీసీఐ నుంచి ఊహించని ఆదేశం వచ్చింది. రంజీల్లో బంగాల్​ తరఫున బరిలోకి దిగుతున్న ఈ క్రికెటర్​కు​.. ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన గులాబీ టెస్టులో వేలికి గాయమైంది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకున్న ఈ సీనియర్​ క్రికెటర్​ త్వరలో దిల్లీతో జరగనున్న రంజీ మ్యాచ్​లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ భారత బోర్డు అతడికి ఊహించని షాకిచ్చింది.

కారణం ఇదేనా..!

న్యూజిలాండ్​తో ఫిబ్రవరి 21 నుంచి రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది కోహ్లీసేన. ఇందులో ప్రధాన కీపర్​గా సాహాను ఎంపిక చేయనున్నారు. సాహా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఉండే పంత్​కు విదేశీ పిచ్​లపై సరైన అవగాహన లేదు. ఫలితంగా సాహాపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు సెలక్టర్లు. ఇప్పటికే ధావన్​, ఇషాంత్​​ వంటి సీనియర్లు కూడా గాయాలపాలయ్యారు. ఫలితంగా టోర్నీకి దూరమయ్యారు. ఈ సందర్భంగా సాహాను జాగ్రత్త వహించమని.. వీలైతే మ్యాచ్​ల్లో ఆడొద్దని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.

వృద్ధిమాన్​ సాహా

బ్యాకప్​ పైనా...

ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ టీ20, వన్డే జట్టుల్లో అంతర్భాగం అయ్యాడు. ప్రపంచకప్‌ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్​లోనూ యువ కీపర్​ పంత్​ స్థానంలో అదరగొట్టాడు. ఒకవేళ సాహా ఎంపికైతే పంత్​ లేదా రాహుల్​ బ్యాకప్ కీపర్లుగా ఉపయోగపడనున్నారు.

జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్ని ఆడనుంది టీమిండియా. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే జట్లని భారత సెలక్టర్లు ప్రకటించారు. శిఖర్ ధావన్‌ స్థానంలో టీ20లకు సంజు శాంసన్‌ ఎంపికవగా.. వన్డేల్లో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.

Last Updated : Feb 18, 2020, 1:59 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details