బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కొద్దిరోజులుగా హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. తన సోదరుడు స్నేహాశిష్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల దాదా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా చేయించుకున్న పరీక్షల్లో గంగూలీకి నెగటివ్‌గా తేలింది.
గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగటివ్ - గంగూలీ కరోనా నెగటివ్
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా నెగటివ్‌గా తేలింది. కొద్దిరోజుల క్రితం తన సోదరుడు స్నేహాశీష్‌కు పాజిటివ్ రావడం వల్ల దాదా హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగటివ్
ప్రస్తుతం బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న స్నేహాశిష్ కుటుంబం కూడా కరోనా నుంచి కోలుకుంటోంది. కొన్నిరోజుల క్రితం తన భార్య, అత్తమామలకు కరోనా పాజిటివ్ రావడం వల్ల స్నేహాశిష్, గంగూలీ ఉంటున్న ఇంట్లోకి మారారు. అయితే గత నెలలోనే స్నేహాశిష్‌కు కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని, తాను ఆరోగ్యంగా ఉన్నట్లు అప్పుడు తెలిపారు.