తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ నెలలోనే టీమిండియా సెలక్టర్ల ఎంపిక: గంగూలీ - sourav ganguly recent news

టీమిండియా నూతన సెలక్టర్లు ఎవరనేది ఈ నెలాఖరులో తెలియనుంది. తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. త్వరలో నూతన సలహా కమిటీ.. అభ్యర్థులకు ముఖాముఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు.

BCCI President Sourav Ganguly
ఈ నెలలోనే టీమిండియా సెలక్టర్ల ఎంపిక: గంగూలీ

By

Published : Feb 4, 2020, 10:49 AM IST

Updated : Feb 29, 2020, 3:01 AM IST

బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో ఏర్పాటైన క్రికెట్‌ సలహా కమిటీ.. అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ముఖాముఖీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి.. ఇద్దరు సభ్యులను ప్రకటించనున్నట్లు తాజాగా వెల్లడించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.

క్రికెట్​ సలహా కమిటీలో మదన్‌ లాల్‌, సులక్షణ నాయక్‌, ఆర్పీ సింగ్‌

ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, అతడి సహచరుడు గగన్‌ ఖోడా పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకోసం మాజీ క్రికెటర్లు అజిత్‌ అగార్కర్‌, లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, నయన్‌ మోంగియా, చేతన్‌ చౌహాన్‌, నిఖిల్‌ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు.

టెస్టుల అనుభవమే ముఖ్యమా..!

అభ్యర్థుల్లో అత్యంత సీనియర్‌ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అన్నట్టు తెలుస్తోంది. ఐదుగురు సభ్యుల కమిటీలో అత్యంత అనుభవశాలి లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే చీఫ్ సెలక్టర్‌ పదవి రావొచ్చని సమాచారం. అంతేకాకుండా బీసీసీఐ రాజ్యాంగంలోని 'కమిటీ సభ్యుల్లో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవశాలి ఛైర్మన్‌గా నియామకం అవుతారు' అన్న నిబంధన ఇందుకు బలం చేకూరుస్తోంది.

త్రిముఖ పోరు...

ప్రస్తుత అభ్యర్థుల్లో లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌ అత్యంత అనుభవశాలి. 1983లో అతను క్రికెట్లోకి అరంగేట్రం చేసినా... తక్కువ టెస్టులే ఆడాడు. వెంకటేశ్‌ ప్రసాద్‌ (33 టెస్టులు), అగార్కర్‌ (26 టెస్టులు) ఎక్కువ మ్యాచ్​లు ఆడారు. వీరిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగానూ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే జతిన్‌ పరాంజపె వెస్ట్‌జోన్‌ నుంచి ఉన్నాడు. ముంబయికి చెందిన అగార్కర్‌ ఎంపికైతే వెస్ట్‌జోన్‌ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతిపెద్ద దేశంలో ప్రాంతాలనూ పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. ఈ ప్రకారంగా అతడికి అవకాశం లేనట్టేనా అన్న సందేహం తలెత్తుతోంది.

Last Updated : Feb 29, 2020, 3:01 AM IST

ABOUT THE AUTHOR

...view details