టీమిండియా సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ త్వరలో ఆరంభం కానుంది. ఇందు కోసం క్రికెట్ సలహా సంఘం(సీఏసీ) వారం రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. నూతన సెలక్షన్ కమిటీ పదవీకాలం గతంలో నాలుగేళ్లు ఉండగా.. ఇకపై మూడేళ్ల వరకే ఉంటుందని వెల్లడించాడు. సెలక్టర్లను ఎంపిక చేసేందుకు కేవలం ఒక సమావేశమే సీఏసీకి ఇవ్వనున్నట్లు తెలిపాడు దాదా.
" రెండు మూడు రోజుల్లో సలహా కమిటీని నియమిస్తాం. ప్రధాన కోచ్ ఎంపిక ఇప్పటికే పూర్తయింది కాబట్టి సెలక్టర్లను ఎంపిక చేసేందుకు సీఏసీ ఒక్కసారే సమావేశం అవుతుంది".
- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు