తెలంగాణ

telangana

ETV Bharat / sports

దినేశ్ కార్తీక్​కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు

టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. అనుమతి లేకుండా కరీబియన్ ప్రీమియర్​ లీగ్ ప్రమోషనల్ ఈవెంట్​కు హాజరు కావడమే ఇందుకు కారణం.

దినేశ్ కార్తీక్

By

Published : Sep 6, 2019, 11:30 PM IST

Updated : Sep 29, 2019, 5:25 PM IST

ప్రపంచకప్​లో చోటు దక్కించుకుని నిరాశపర్చిన ఆటగాడు దినేశ్ కార్తీక్. ఐపీఎల్​లో​ షారూక్ యాజమానిగా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​కు సారథిగా ఉన్నాడు. తాజాగా ఈ ఆటగాడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రమోషనల్ ఈవెంట్​కు హాజరైనట్లు తెలిసింది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించగా.. దీనిపై వివరణ కోరుతూ అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ.

కరీబియన్ ప్రీమియర్​ లీగ్​లో ట్రింబాగో నైట్ రైడర్స్​కు షారూక్ యజమానిగా ఉన్నాడు. అందువల్లే కార్తీక్ ఈ వేడుకకు హాజరయ్యాడని సమాచారం.

"కార్తీక్​కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ట్రింబాగ్ నైట్​రైడర్స్​ డ్రెస్సింగ్​ రూమ్​లో కార్తీక్ ఉన్నట్లు ఫొటోలు మాకు అందాయి. అనుమతి లేకుండా వెళ్లినందుకే నోటీసులు పంపాం."
-బీసీసీఐ అధికారి

ట్రింబాగ్​ నైట్ రైడర్స్​ డ్రెస్సింగ్​ రూమ్​లో కివీస్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్​కల్లమ్​ పక్కన కూర్చుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేశాయి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు వేరే ప్రైవేట్ లీగుల్లో పాల్గొనడానికి వీలులేదు. అందుకే బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి.. టెస్టులకు గుడ్ బై చెప్పనున్న అఫ్గాన్​ ఆల్​రౌండర్​

Last Updated : Sep 29, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details