ఐపీఎల్ 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి థర్డ్ పార్టీలనుఆహ్వానించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). వేలంలో పాల్గొనదలచిన వారు ఆగస్టు 14లోపు వారి వివరాలు పంపిస్తే.. ఆగస్టు 18న వేలం జరుగుతుందని వెల్లడించింది.
"ఆసక్తి ఉన్నవారు 'ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్' కోసం తమ వివరాలను బీసీసీఐకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 14వ తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు తుదిగడువు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించాలా లేదా అనేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ వేలం ఆగస్టు 18 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పైన తెలిపిన ప్రణాళికను బీసీసీఐ అభీష్ఠానుసారం మార్చడానికి వీలుంటుంది" అని బీసీసీఐ వెల్లడించింది.