తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2019, 10:05 AM IST

ETV Bharat / sports

ప్రపంచకప్​లో పాల్గొనే టీమిండియా జట్టిదే..

వచ్చే ఏడాది జరగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. ప్రియమ్ గార్గ్​ను కెప్టెన్​గా నియమించింది.​

BCCI: Indian squad for the U-19 Cricket World Cup announced.
ప్రపంచకప్​లో పాల్గొనే టీమిండియా జట్టిదే..

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ప్రియమ్ గార్గ్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. కీపర్ ధృవ్ చంద్ జురెల్ వైస్​ కెప్టెన్​గా ఉండనున్నాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. న్యూజిలాండ్, శ్రీలంకతోపాటు క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్న జపాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉండగా, ఆతిథ్య దక్షిణాప్రికా.. అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడాతో కలిసి గ్రూప్-డిలో ఉంది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే ఈ టోర్నీలోమొత్తం 16 జట్లు తలపడనున్నాయి.

భారత జట్టు

ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్​చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.

ప్రపంచకప్​లో పాల్గొనే టీమిండియా జట్టిదే..

గ్రూపుల వారిగా జట్లు

గ్రూప్-ఎ: ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, నైజీరియా
గ్రూప్-సి: పాకిస్థాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడా

ఇవీ చూడండి.. వరుసగా రెండో ఏడాది 'ముస్తాక్ అలీ' కర్ణాటకదే

ABOUT THE AUTHOR

...view details